దిశ శేరిలింగంపల్లి: వారు ఇరువురు సహా ద్యోగులు.. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. అప్పటికే అతనికి వేరే మహిళతో వివాహం జరిగింది. అయినా తనను వివాహం చేసుకోవాలంటూ వీడియో కాల్ చేసింది. లైవ్‌లోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ లో సంచలనంగా మారింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చనా చౌదరి మాలిక్ చంద్ర నాయక్ తండాలోని ఎస్ఆర్ సద్గురు రెసిడెన్సీలో నివాసం ఉంటోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన భండారి విమల్, ఆమె గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విమల్ తన భార్య నుంచి విడాకులు తీసుకునే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం.