తిరుపతి జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో చిన్నపాటి పొరపాట్లు, ధ్రువపత్రాలు నింపడంలో లోపాలు వైకాపా అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఈనాడు డిజిటల్, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో చిన్నపాటి పొరపాట్లు, ధ్రువపత్రాలు నింపడంలో లోపాలు వైకాపా అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రధానంగా పాకాల, రేణిగుంట, శ్రీకాళహస్తి, రామచంద్రాపురం, నారాయణవనం మండలాల్లో ఆ పార్టీ నామినేషన్లు పెద్దఎత్తున తిరస్కరణకు గురయ్యాయి. రామచంద్రాపురం మండలంలో వైకాపా 34 నామినేషన్లు వేయగా 22 తిరస్కరణకు గురయ్యాయి. ఇక్కడ తెదేపా వేసిన 24 నామినేషన్లూ ఆమోదం పొందాయి. శ్రీకాళహస్తి మండలంలో 74కు 39 తిరస్కరణకు గురయ్యాయి.