తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొండపై విపరీతమైన రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తుల క్యూలైన్.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తుల క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు చేరుకుంది.ఈ ఉదయం 8 గంటల సమయానికి క్యూలో ఉన్న భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 12 నుంచి 13 గంటల సమయం పట్టవచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.