స్థానిక సంస్థల ఎన్నికలు అంటే హడావిడి, హంగామా కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ, ఈసారి నగరంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్‌కు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తించాలి. ప్రజల్లో కూడా ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరగాలి. అయితే క్షేత్రస్థాయిలో అటువంటి వాతావరణం కానరావడం లేదు. ఒకటి, రెండు రోజులు నుంచి మాత్రమే అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా ఊపందుకోలేదు. మరోవైపు ప్రజలు కూడా ఈ ఎన్నికలను పెద్ద సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రాబల్యం అధికంగా ఉండే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు.