సమాజంలో ఏళ్లుగా వివక్షకు గురవుతూ... తమ అస్తిత్వం కోసం నిత్యం పోరాడుతున్న ట్రాన్స్జెండర్ల జీవితాల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త వెలుగులు నింపింది. ఈనాడు, హైదరాబాద్-న్యూస్టుడే, ఉస్మానియా ఆసుపత్రి: సమాజంలో ఏళ్లుగా వివక్షకు గురవుతూ... తమ అస్తిత్వం కోసం నిత్యం పోరాడుతున్న ట్రాన్స్జెండర్ల జీవితాల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త వెలుగులు నింపింది. తాజాగా 19 మందికి విజయవంతంగా చికిత్సలు నిర్వహించింది. ఇందులో అమ్మాయి నుంచి అబ్బాయిగా 11 మంది మారగా.. మరో ఎనిమిది మంది అబ్బాయిల నుంచి అమ్మాయిలుగా కొత్త రూపు సంతరించుకున్నారు.