హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌లోని ‘సిటీ ఆర్మ్డ్ రిజర్వు (కార్) హెడ్‌క్వార్టర్స్ విభాగంలో ఒక క్యాంపు క్లర్కు (జూనియర్ అసిస్టెంట్).. డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఖాతాలోని సొమ్ముపై కన్నేశాడు.. పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.కోటికిపైగా స్వాహాహైదరాబాద్ సిటీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌లోని ‘సిటీ ఆర్మ్డ్ రిజర్వు (కార్) హెడ్‌క్వార్టర్స్ విభాగంలో ఒక క్యాంపు క్లర్కు (జూనియర్ అసిస్టెంట్).. ఎవరికీ అనుమానం రాకుండా పక్కాగా ప్లాన్ వేశాడు.. ఖాతాలోని అసలు సొమ్మును ముట్టుకోకుండా, దానిపై జమయ్యే వడ్డీని.. ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి విత్‌డ్రా చేసుకున్నాడు.. ఆ సొమ్ముతో జల్సాలు చేసి, అడ్డగోలుగా ఖర్చులు పెట్టేసుకున్నాడు..