రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడ రాణిగారి తోటకు చెందిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) తన విచారణను తీవ్రతరం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అడిషనల్ ఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం విజయవాడ చేరుకుని దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఘటనకు ప్రధాన కేంద్రమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీబీఐ అధికారులు అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా తనిఖీలు మరియు విచారణ చేపట్టడం బెజవాడ పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీబీఐ బృందం ఏకధాటిగా దాదాపు 6 గంటల పాటు విచారణ జరిపింది.