ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ యేడు మక్కల సాగు భారీగానే తగ్గింది. వర్షాలు తక్కువ పడటం తో లక్ష ఎకరాలకు లోపే సాగు చేశారు. దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ యేడు మక్కల సాగు భారీగానే తగ్గింది. వర్షాలు తక్కువ పడటం తో లక్ష ఎకరాలకు లోపే సాగు చేశారు. పంట చేతికి రావడం తో ఉమ్మడి జిల్లాలో ఆయా మార్కెట్ పరిధిలో మొక్కజొన్నలు తీసుకువచ్చిన రైతులకు గిట్టుబాటుకు మించి ధర వస్తుంది. మక్కలకు మద్దతు ధర క్వింటాలుకు రూ.2410 ఉండగా మార్కెట్లో క్వింటాలుకు రూ.2970 వరకు ధర పలుకుతోంది.