విశాఖపట్నం స్టీల్ ప్లాంటు గత కొంతకాలంగా నిలిపివేసి ‘వైజాగ్ టీఎంటీ’ రీబార్ల ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు గత కొంతకాలంగా నిలిపివేసి ‘వైజాగ్ టీఎంటీ’ రీబార్ల ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించింది. నిర్మాణ రంగంలో ఈ రీబార్లను అత్యధికంగా వినియోగిస్తారు. ప్లాంటులోని వివిధ విభాగాల్లో వెలువడే వృథా వాయువులతో రీబార్ల యూనిట్ నడిచేలా ఏర్పాట్లుచేశారు. అయితే వివిధ కారణాల వల్ల ప్లాంటు పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడకవపోవడం వల్ల వృఽథా వాయువులు తగినంత అందక ఈ యూనిట్ సరిగ్గా పనిచేయలేదు. దీంతో ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకొని వారి వద్ద ఇప్పటివరకు రీబార్లు తయారు చేయించారు.