మంచుపర్వతాలు అధిరోహించడం 17 ఏళ్ల ఆగమ్జైన్ అభిరుచి. నగరంలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రేడ్-12 చదువుతున్నారు. ఈనాడు, హైదరాబాద్: మంచుపర్వతాలు అధిరోహించడం 17 ఏళ్ల ఆగమ్జైన్ అభిరుచి. నగరంలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రేడ్-12 చదువుతున్నారు. ఈ విద్యార్థి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని 10 గ్రామాలకు వాతావరణ హెచ్చరికలు అందించే పరికరాలను ఉచితంగా అందించారు. ‘సమ్మిట్ సాథి’ పేరుతో వాతావరణ స్థితిగతులను తెలిపే ఈ పరికరం నేరుగా ఉపగ్రహం నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. 2 నెలల క్రితం 10 గ్రామాల్లో మూడుచోట్ల వాటిని అమర్చి పనితీరును పరీక్షిస్తున్నారు.