డంపింగ్ యార్డు కారణంగా హైదరాబాద్‌కు ముప్పు పొంచి ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నాగారం, న్యూస్‌టుడే: డంపింగ్ యార్డు కారణంగా హైదరాబాద్‌కు ముప్పు పొంచి ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై భాజపా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డు సమస్యపై సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని, లేకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. సమస్యలు పరిష్కరిస్తారని, ప్రశ్నించే గొంతుక అని ఎంపీగా రేవంత్‌రెడ్డిని ఈ ప్రాంత ప్రజలు గెలిపిస్తే.. రాజకీయ భిక్ష పెట్టిన ఈ ప్రాంత ప్రజలకు విషం పెడుతున్నారని ఆరోపించారు.