నగరంలోని ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో, ఎలాంటి డ్రైవింగ్... హైదరాబాద్: నగరంలోని ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో, ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అతివేగంగా దూసుకొచ్చిన ఓ టయోటా ఫార్చ్యూనర్ కారు.. అద్దె కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో చిన్న కారు గాల్లోకి ఎగిరి పలుమార్లు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి.