జాతీయస్థాయిలో నిర్వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్ఐ-సెట్)లో గుంటూరుకు చెందిన సోమేపల్లి నాగ సింధు ఐదో ర్యాంకు సాధించారు. గుంటూరు (తూర్పు), నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో నిర్వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్ఐ-సెట్)లో గుంటూరుకు చెందిన సోమేపల్లి నాగ సింధు ఐదో ర్యాంకు సాధించారు. దేశవ్యాప్తంగా సుమారు 62 వేల మంది వైద్యులు పోటీపడిన ఈ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. నాగ సింధు గుంటూరులోని ఎన్నారై అకాడమీలో ఇంటర్మీడియట్, భువనేశ్వర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.