మందులు వాడుతున్నా దగ్గు తగ్గడం లేదు. ఛాతీలో ఇన్ఫెక్షన్తో నెలల తరబడి ఇబ్బందిపడుతున్న 72 ఏళ్ల వృద్ధుడిని పరీక్షించిన వైద్యులకు మొదట ఒకటే అనుమానం వచ్చింది. ఊపిరితిత్తుల్లో ఏదో కణితి పెరుగుతోందని భావించారు. సీటీ స్కాన్లోనూ ఆనవాళ్లు కనిపించడంతో వెంటనే బ్రాంకోస్కోపీ పరీక్ష చేశారు. కానీ అక్కడ బయటపడిన నిజం వైద్యులనే ఆశ్చర్యపరిచింది. అది క్యాన్సర్ కణితి కాదు..మనిషి పంటి ముక్క! అది కూడా ఒకటి, రెండు రోజులు కాదు.. మూడేళ్లుగా ఆయన శ్వాసనాళంలోనే ఉండిపోయింది.