Cheyutha Pensions: తెలంగాణలోని నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ వేళ తీపి కబురు అందించింది. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 4.5 లక్షల మంది అర్హులకు 'చేయూత' పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. నవంబర్ 8న వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై, మంత్రి సీతక్కతో కలిసి లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.