Megaverse: టాలీవుడ్ చరిత్రలో కనీవినీ ఎరుగని దృశ్యం త్వరలోనే డిజిటల్ స్క్రీన్‌పై ఆవిష్కృతం కాబోతోంది. ఒకవైపు హోస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి.. ఆయన ఎదురుగా కూర్చుని ముచ్చటించే గెస్ట్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. దశాబ్దాలుగా కోట్లాది మంది మెగా అభిమానులు కంటున్న ఈ కలల ఫ్రేమ్ ఇప్పుడు ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా నిజం కానుంది. గ్లోబల్ ఓటీటీ దిగ్గజం రూపొందిస్తున్న సరికొత్త టాక్ షో ‘చిరంజీవీస్ మెగావర్స్’.