నితీష్ తివారీ ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణం'లో విభీషణుడి పాత్రకు గాను తనకు రావలసిన రూ. 6 కోట్ల పారితోషికాన్ని పూర్తిగా విరాళంగా ప్రకటించారు ఓ హీరో. అంతేకాకుండా తన 50వ పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్తో పోరాడుతున్న 50 మంది నిరుపేద చిన్నారుల ఉచిత వైద్య చికిత్సను అదందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నిజమైన మానవత్వాన్ని చాటుకుంటూ రియల్ హీరోగా నిలిచారు. సినిమా తెరపై విలన్గా, హీరోగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్. తాజాగా నిజజీవితంలో తన ఉదారతతో రియల్ హీరో అనిపించుకున్నారు.