ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో తోటకూరకు ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ సమయంలోనే సులభంగా, రుచికరంగా తోటకూర వేపుడు తయారు చేసుకోవచ్చు. శనగపప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలా దినుసులతో చేసే ఈ ఆంధ్ర స్టైల్ తోటకూర వేపుడు అన్నం, చపాతీలోకి ఎంతో రుచిగా ఉంటుంది. కేవలం 10–15 నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకాన్ని మీ ఇంట్లో కూడా తప్పక ప్రయత్నించండి! ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూరను చాలామంది ఇష్టపడరు. అయితే, ఈ పద్ధతిలో తోటకూర వేపుడు చేస్తే, ఆకుకూరలు తినని వారు కూడా ఇష్టంగా తింటారు.