టూత్ బ్రష్‌తో పళ్లు తోముకుంటూ ఎవరైనా దాన్ని మింగేస్తారా? వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదూ! కానీ మహారాష్ట్రలో నిజంగానే ఇలాంటి ఘటనే జరిగింది. ఒక వ్యక్తి పొరపాటున ఏకంగా 19 సెంటీమీటర్ల పొడవున్న టూత్ బ్రష్‌ను మింగేశాడు. అది కడుపులోకి వెళ్లి అడ్డంగా ఇరుక్కుపోయింది. దీంతో వైద్యులు కూడా ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే దాన్ని బయటకు తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మహారాష్ట్రలోని పెన్ ప్రాంతానికి చెందిన రాజేంద్ర మాలుసారే.