దీపావళికి పిల్లలకు డబ్బులు గిఫ్ట్‌గా ఇస్తే ఆదాయపు పన్ను చెల్లించాలా? ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ వంటి నిర్దిష్ట బంధువులు ఇచ్చే బహుమతులకు సాధారణంగా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఆ డబ్బును ఎఫ్డీలో పెట్టి సంపాదించే వడ్డీపై క్లబ్బింగ్ నిబంధనలు వర్తించవచ్చు. మైనర్ పిల్లల ఆదాయం, పెట్టుబడులు, పన్ను మినహాయింపుల గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే. దీపావళి పండుగ వచ్చిందంటే ఇంట్లో సందడే సందడి. కొత్త బట్టలు, స్వీట్లు, బహుమతులతో పాటు పిల్లలకు డబ్బులు ఇవ్వడం కూడా మన సంప్రదాయం. అయితే పిల్లలకు ఇలా డబ్బులు ఇచ్చినప్పుడు ఆదాయపు పన్ను చెల్లించాలా?