ఓబీసీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు మరో కీలక స్పష్టత ఇచ్చింది. తల్లిదండ్రుల జీతాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఓబీసీ అభ్యర్థులను క్రీమీలేయర్ పరిధిలోకి తీసుకురాలేమని గతంలో ఇచ్చిన తీర్పు పరిధిని తాజాగా వివరించింది. అయితే ఈ తీర్పుతో ఇప్పటికే పూర్తయిన ఉద్యోగ నియామకాలు, ఎంపికలు, పదోన్నతులు, సీనియారిటీపై ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అదే సమయంలో ఇంకా సర్వీసుల కేటాయింపు పూర్తికాని సివిల్ సర్వీసెస్ పరీక్ష–2025 అభ్యర్థులకు మాత్రం ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో.