AP HRC: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జడ్పీ హైస్కూల్లో చోటుచేసుకున్న తీవ్ర దిగ్భ్రాంతికరమైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. అక్టోబర్ 31, 2026న గణితం పాఠం జరుగుతుండగా, హేమంత్ (21) అనే వ్యక్తి రన్నింగ్లో ఉన్న ఎలక్ట్రిక్ చైన్సాతో తరగతి గదిలోకి చొరబడి 10వ తరగతి విద్యార్థినిపై దారుణంగా దాడి చేశాడు. ఆమెను కాపాడేందుకు యత్నించిన లక్ష్మి అనే మరో విద్యార్థినికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ రక్తపు మడుగులో వదిలి నిందితుడు పరారయ్యాడు.