హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డీటీఎఫ్ టీమ్ దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నగరంలోని కుత్బుల్లాపూర్‌లో డ్రగ్స్ విక్రయాలపై డీటీఎఫ్ బృందం దాడులు నిర్వహించింది. హైదరాబాద్, నవంబర్ 6: భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. కారులో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో వివిధ రకాల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీటీఎఫ్ బృందం నిర్వహించిన తనిఖీల్లో నిందితుడి వద్ద 58 గ్రాముల ఓజీ కుష్ లభ్యమైంది. అదేవిధంగా 0.95 గ్రాముల ఎండీఎంఏ, రెండు ఎల్ఎస్డీ బ్లాట్స్ను అధికారులు పట్టుకున్నారు.