ఆరోగ్యకరమైన, ఒత్తైన, పొడవైన జుట్టును కోరుకునే వారికి ఇది మంచి చిట్కా. మెంతులు కేవలం డయాబెటిస్ నియంత్రణకు మాత్రమే కాకుండా, జుట్టు సంరక్షణలో కూడా అద్భుతాలు చేయగలవని ఆయన నొక్కి చెప్పారు. డయాబెటాలజిస్టులు మెంతులకు సంబంధించిన పరిశోధనలు చేసి, డయాబెటిస్ నియంత్రణలో మెంతుల ప్రాముఖ్యతను కూడానిరూపించారు. అయితే, మెంతులలో జుట్టు ఆరోగ్యానికి సంబంధించి ఇంకా అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయన వెల్లడించారు. మెంతులు చుండ్రును తగ్గించడానికి, జుట్టును పెంచడానికి , తలలో ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించడానికి చాలా మంచివని రుజువు చేశారు. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి తలలోని ఇన్ఫెక్షన్లు, బలహీనమైన కుదుళ్లు.