పండగ సీజన్లో పసిడి ప్రియులకు శుభవార్త. నవంబర్ 6న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు, క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్ బలహీనపడటం, పండగ డిమాండ్ కారణంగా ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గంటల్లోనే ధరలు తారుమారు అవుతున్నాయి. ధంతేరాస్ పండుగ కావడంతో ఇవాళ చాలామంది బంగారం కొంటూ ఉంటారు. నేడు బంగారం లేదా వెండి కొంటే శుభం జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ పండుగ రోజున ఎంతోకొంత గోల్డ్ లేదా సిల్వర్ కొని పూజగదిలో పెట్టుకుని పూజలు చేసే సాంప్రదాయం ఉంది. ఈ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి భారీ ఊరట కలిగింది.