Dhanteras 2026: దీపావళి పండుగకు ముందు వచ్చే ధంతేరస్కు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ధంతేరస్ రోజున ధన్వంతరి దేవుడు, కుబేరుడు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు..