పాతబస్తీ చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చారిత్రక చార్మినార్ చెంతన వెలసిన ప్రముఖ భాగ్యలక్ష్మి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీ నియంత్రణకు ఈ నెల 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.. దీపావళి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే చారిత్రక పాతబస్తీ చార్మినార్ పరిసర ప్రాంతాల నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.