BrahMos Deal: సౌత్ చైనా సీలో ఆధిపత్యం ప్రదర్శిస్తూ పొరుగు దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చైనాకు దిమ్మతిరిగే కౌంటర్ పడబోతోంది. డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఫిలిప్పీన్స్ తన సైనిక బలగాలను ఊహించని రీతిలో సన్నద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన భారత సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ను భారీ సంఖ్యలో మోహరించేందుకు రంగం సిద్ధమైంది. భారత్ – ఫిలిప్పీన్స్ మధ్య జరుగుతున్న రెండో విడత బ్రహ్మోస్ కొనుగోళ్ల చర్చలు తుది దశకు చేరుకున్నాయి..