Central Government Funds: పండుగల సీజన్లో రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల చేసింది. సాధారణంగా నవంబర్ 10న విడుదల చేయాల్సిన నెలవారీ పన్నుల వాటా నిధులను ఐదు రోజుల ముందుగానే నవంబర్ 5న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 28 రాష్ట్రాలకు కలిపి రూ.1,09,019 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. పండుగల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులను అందుబాటులో.