తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. చిన్న చిన్న సంఘటనలు మినహా ఎక్కడా పెద్దగా ఇష్యూస్ ఏమీ లేవన్నారు. తిరుపతి, నవంబర్ 5: జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలో ఉదయం పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందంటూ కొన్ని వార్తలు, ప్రచారాలు వచ్చాయని.. వాస్తవానికి ఆ ఘటన ఉదయం 6 గంటల కంటే ముందే ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న పెనుగులాట వల్ల జరిగిందని చెప్పుకొచ్చారు.