Supreme Court has refused to transfer the investigation into the Tirupati Laddu adulteration case outside Andhra Pradesh. తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు పైన దాఖలైన పిటీషన్ విచారణ చేసిన సుప్రీం కోర్టు నిర్ణయం వెల్లడించింది. ఈ కేసు విచారణ ఏపి కాకుండా రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.