ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లమ్మ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పలువురు హీరోయిన్స్. ఈమధ్య కాలంలో కొందరు భామలు టాలీవుడ్ ఇండస్ట్రీ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాజాగా రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ పై అటు సినీ ప్రముఖులు, ఇటు తెలుగు అడియన్స్ మండిపడుతున్నారు. తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం రాధిక ఆప్టేకు ఇచ్చిపడేసింది. తమకు లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీని, అన్నం పెట్టిన పరిశ్రమను గౌరవించడం ప్రతి నటీనటుడి బాధ్యత. కానీ ఈమధ్య కాలంలో కొందరు హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.