పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ భారత్కు ఇరాన్ భారీ ఊరటనిచ్చింది. వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారత వాణిజ్య నౌకలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు వెల్లడించారు. భారత్ నుంచి మందుల సరఫరాలను సులభతరం చేయడం కూడా ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణమని తెలిపారు. అయితే భారత, చైనా నౌకల నుంచి రవాణా రుసుములు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అసలు హార్ముజ్ జలసంధి భారత్కు ఎందుకు కీలకం? తెలుసుకుందాం..