అక్బర్ ఒకరోజు బీర్బల్‌కు విచిత్రమైన సవాలు విసిరాడు. ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని బంధించి తీసుకురావాలని ఆదేశించాడు. అందుకు ఏడు రోజుల గడువు కూడా ఇచ్చాడు. ఈ అసాధ్యమైన పనిని బీర్బల్ ఎలా పూర్తి చేశాడు? తన తెలివితేటలతో అక్బర్‌కు ఎలాంటి సమాధానం చెప్పాడు? సూర్యుడిని బంధించలేకపోయినా అందరినీ ఆశ్చర్యపరిచిన బీర్బల్ కథలోని నీతి ఏమిటో తెలుసుకుందాం.. తెలివితేటలు ఉంటే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవచ్చని చాలామంది నమ్ముతారు. కానీ అసాధ్యమైన పనిని సైతం పూర్తి చేయాలని ప్రయత్నించడం కంటే, అందులోని నిజాన్ని గుర్తించి సరైన సమాధానం చెప్పడమే అసలైన తెలివితేటలు. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ తన చాకచక్యంతో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపించేవాడు.