Anshul Kamboj Record: న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్లో ఒక్క బంతిని ఎదుర్కోకుండానే.. రెండు లేదా అంతకంటే తక్కువ వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న భారత బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బుధవారం ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కాంబోజ్ ఈ రికార్డు అందుకున్నాడు. కాంబోజ్ తన 10 ఓవర్ల కోటాలో.