Virat Kohli 38th Birthday: రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురువారం తన 38వ పుట్టినరోజు (38th birthday) జరుపుకుంటున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన, రికార్డుల మోత మోగించిన ఒక అద్భుతమైన జర్నీలో విరాట్ మరో ఏట అడుగుపెట్టాడు. చేతిలో చిన్న BDM బ్యాట్ పట్టుకుని అండర్-19 (U19) రోజుల్లో అదరగొట్టిన కుర్రాడు.. ఇప్పుడు 'MRF Genius' బ్యాట్‌తో మైదానంలో ప్రత్యర్థులపై విరుచుపడుతూ క్రికెట్ ప్రపంచాన్నే షాక్‌కు గురి చేస్తున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు, ట్రోఫీలు, మైలురాళ్లు, మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్, గుండెల్ని పిండేసే ఓటములు..