Hyderabad Water Tanker Strike Ends:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీటి కష్టాలతో సతమతమవుతున్న నగరవాసులు, వాణిజ్య సముదాయాలకు మంచి భారీ ఊరట లభించింది. తమ సమ్మె తక్షణమే విరమిస్తున్నట్లు వాటర్ ట్యాంకర్ల యజమానులు ప్రకటించారు. హైదరాబాద్లో నీటి ట్యాంకర్ల యజమానులు సమ్మె విరమించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు ఆ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ నేతృత్వంలో ప్రతినిధులు హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్తో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో వాటర్ ట్యాంకర్ల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. కమిషనర్ సూచనల మేరకు సమ్మె విరమణ చేయాలని నిర్ణయించారు.