దొంగతనం చేయలేదని చెబుతున్నా తనపై చోరీ నింద వేయడంతో ఓ 17 ఏళ్ల బాలుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన మాట ఎవరూ నమ్మడం లేదనే ఆవేదనతో దేవరకద్ర సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు కథనంలో.. తన మాట ఎవరూ నమ్మడం లేదనే ఆవేదనతో చివరకు రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు తన చిన్నమ్మ, బాబాయ్ ఇంటికి వెళ్లాడు. అయితే ఇంట్లో ఉంచిన కొంత నగదు కనిపించకుండా పోయింది.