దీపావళి అంటే దీపాల వెలుగులు, కొత్త బట్టలు, పిండి వంటలు, టపాసుల సందడి మాత్రమే కాదు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక కూడా. అయితే దీపావళి పండుగను దేశమంతా ఒకే కథతో గుర్తు చేసుకోరు. ఉత్తర భారతదేశంలో శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంతో దీపావళిని అనుసంధానిస్తే.. దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన కథకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా నరక చతుర్దశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, నూనె స్నానం చేసి,.