ప్రస్తుత సాంకేతిక యుగంలో సామాజిక మాధ్యమాల వినియోగం ఎక్కువైంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దీనిని వినియోగిస్తున్నారు. వరంగల్ క్రైం (హనుమకొండ), న్యూస్టుడే: ప్రస్తుత సాంకేతిక యుగంలో సామాజిక మాధ్యమాల వినియోగం ఎక్కువైంది. ఇన్స్టాగ్రామ్ల ద్వారా కొంత మంది ఎదుటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు, మహిళలను నమ్మించి, ఆశ చూపించి మోసాలకు పాల్పడుతున్నారు. తెలియని వ్యక్తుల మధురమైన మాటలు, భవిష్యత్తు గురించి చేసే వాగ్దానాలు కొన్నిసార్లు మోసానికి, వేధింపులకు దారితీస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనవారు కొన్ని సంక్షిప్త సందేశాలతో సాన్నిహిత్యం పెంచుకుంటారు. తెర వెనుక ఉన్న వ్యక్తి నిజమైన ఉద్దేశాలు మనకు తెలియదు.