Hyderabad: చిల్లర వివాదంలో తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర దిగ్భ్రాంతి. Hyderabad: చిల్లర విషయంలో జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక (28) చికిత్స పొందుతూ మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద అక్టోబర్ 25న చిల్లర విషయమై జరిగిన వివాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన ప్రవళికను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కొత్తపేటలోని సాయి సంజీవిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.