ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో కీలక భాగంగా మారిపోయింది. ఆఫీస్ పనులు, ఆన్లైన్ పేమెంట్లు, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రతి అవసరానికీ ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. రోజంతా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోవడం చాలామందికి ఎదురయ్యే సమస్య. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇలాంటి సమయంలో పవర్ బ్యాంక్ ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారి కోసం TRIGGR సంస్థ 10,000mAh సామర్థ్యంతో కొత్త పవర్ బ్యాంక్‌ను అందిస్తోంది.