AP and Telangana Rains Alert: తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది, మరి కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఇప్పటికే తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టించగా.. బంగాళాఖాతంలోని వాతావరణ మార్పుల కారణంగా ఈ రోజు కూడా ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.