Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా, తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తెలిపారు. గత రెండున్నరేళ్లుగా ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు అందించిన ఆశీర్వాదంగా ఈ తీర్పును స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరికీ నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మూడు.