Iran Threatens Trump: అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న కీలక సమయంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కలకలం రేగింది. 'మేం ట్రంప్‌ను చంపేస్తాం' అని రాసి ఉన్న భారీ హోర్డింగ్‌ను టెహ్రాన్ వీధుల్లో ఏర్పాటు చేస్తూ ఇరాన్ బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. టెహ్రాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఎంగెలాబ్ స్క్వేర్‌లో ఈ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జైలు కటకటాల వెనుక తలదించుకుని కూర్చున్నట్లుగా చూపించారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత అక్కడ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు మరింత తీవ్రమయ్యాయి.