నటనలో వైవిధ్యం, బోల్డ్ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే మరోసారి సౌత్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చకు తెరతీశారు. గతంలో టాలీవుడ్లో పనిచేసిన అనుభవాలను తవ్వుకుంటూ ఆమె చేసిన తాజా కామెంట్లు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుని, స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు పొందిన ఈ భామ… ఇప్పుడు ఇండస్ట్రీ నిలదొక్కుకున్నాక అదే పరిశ్రమపై విషం చిమ్ముతోందంటూ సినీ ప్రేమికులు మండిపడుతున్నారు. ఇది.