Guntur: గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అమృతవల్లికి అంతర్జాతీయ పురస్కారం. జీవ ఎరువుల తయారీ పరిశోధనలకు గోవా సదస్సులో ఎక్సలెన్స్ అవార్డు. ఈ మూడు లక్ష్యాలను మేళవించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ సీనియర్ ఆచార్యురాలు ప్రొఫెసర్ ఎ. అమృతవల్లి పరిశోధనా ప్రస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తక్కువ ఖర్చుతో జీవ ఎరువుల తయారీ సాంకేతికత అభివృద్ధికి ఆమె చేసిన పరిశోధనలకు గోవాలో జరిగిన 9వ ఏషియన్ పీజీపీఆర్ అంతర్జాతీయ సదస్సులో ‘అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్’ పురస్కారం లభించింది.