ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈవీఎంలకు భిన్నంగా బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపు ఐదు దశల్లో సాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, 25 పత్రాలతో కట్టలు, రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు, చెల్లని ఓట్ల గుర్తింపు, రీకౌంటింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. రీపోలింగ్ జరిగిన బూత్‌లతో పాటు..రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పురపోరుకు సంబంధించిన ఫలితాల విడుదల 8 గంటలకు మొదలవుతుంది.. అయితే ఈవీఎం కౌంటింగ్‌తో పోలిస్తే బ్యాలెట్ పత్రాల కౌంటింగ్ కాస్త భిన్నంగా ఉంటుంది. కౌంటింగ్ నుంచి ఫలితం అనౌన్స్ చేసే వరకూ మొత్తం ఐదు ఫేజ్‌లు ఉంటాయి..