ప్రముఖ నటుడు బాబ్లూ పృథ్విరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్లోని కొన్ని చేదు అనుభవాలను, అలాగే వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. తాను ఎంతో కష్టపడి నటించిన సన్నివేశాలు సినిమా ఫైనల్ అవుట్పుట్లో లేకుండా పోవడం వెనుక ఆశ్చర్యకరమైన కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు, ఒడిదుడుకులను ఎదుర్కొంటేనే నటుడిగా నిలదొక్కుకోగలరు. అయితే కొంతమంది నటులకు కెరీర్ పరంగా ఎదురయ్యే సమస్యలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అలాంటి వారిలో ప్రముఖ నటుడు బాబ్లూ పృథ్విరాజ్ ఒకరు.