ప్రతి ఏటా నవంబర్ 3న ‘అంతర్జాతీయ బయోస్ఫియర్ రిజర్వ్‌ల దినోత్సవం’ (International Day for Biosphere Reserves)ను జరుపుకుంటారు. కేవలం చెట్లు, అడవులను కాపాడటం మాత్రమే కాకుండా.. మానవాళికి, ప్రకృతికి మధ్య ఎలాంటి ఘర్షణ లేకుండా అన్యోన్యంగా ఎలా జీవించవచ్చో చాటిచెప్పే ప్రత్యేకమైన ప్రయోగశాలలే ఈ బయోస్పియర్ రిజర్వ్‌లు. కేవలం అటవీ ప్రాంతాల సంరక్షణే కాకుండా, స్థానిక ప్రజల జీవనోపాధిని దెబ్బతీయకుండా పర్యావరణాన్ని రక్షించడం వీటి ప్రధాన ఉద్దేశం. సాధారణ అభయారణ్యాలు లేదా నేషనల్ పార్కుల్లోకి సాధారణ.